కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: గన్నేరువరం మండల తాసిల్దారుగా బిక్షపతి గురువారం బాధ్యతలు చేపట్టారు.సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో విధులు నిర్వహించి బదిలీపై మండలానికి వచ్చారు. కాగా ఇక్కడ విధులు నిర్వహించిన తాసిల్దార్ అనంతరెడ్డి బదిలీపై కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ కు బదిలీపై వెళ్లారు.గురువారం నూతన తాసిల్దార్ బిక్షపతిని డిప్యూటీ తాసిల్దార్ మహేష్ రావు,ఆర్ఐ రజినీకాంత్, గన్నేరువరం మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు బోడ ప్రతాప్ రెడ్డి,గుండ్లపల్లి నాయకులు బేతేల్లి రాజేందర్ రెడ్డి,కె బాబు లు శాలువలతో సత్కరించి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
