ఈవిడ మన భారతదేశ జాతీయ జెండా రూపకర్త కీ”శే” పింగళి వెంకయ్య గారికి స్వయానా కోడలు….ఈమె ఏలూరు లోని ఒక గుడిమెట్ల వద్ద కూర్చుని బిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుంది.
ఈ విషయాన్ని గుర్తించిన ఆ ఏరియా కలెక్టర్ ఆగష్టు రెండవ తేదీన కీ”శే” పింగళి వెంకయ్య గారి జన్మదినం సందర్బంగా ఆయన కుటుంబ సభ్యులను కలసి ఆమె గురించి తెలుసుకుని ఆమె వద్దకు వెళ్ళి పళ్ళు, ఫలహారాలు అందించి, అమ్మా, ఇకనుంచి ప్రభుత్వ ఖర్చుతో నీకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలుపగా….ఆమె ఒప్పుకోలేదు. నేను ప్రభుత్వానికి భారం కాదల్చుకోలేదు అని చక్కగా వ్యాఖ్యానించిదట.
ఆమెతో పోని ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో చేరుస్తాము రండి అనినా కూడా ఆమె ఒప్పుకోలేదట….నేను ఈ గుడి వద్దనే ఉంటు దైవస్మరణ చేసుకుంటూ బ్రతుకుతాను…అని తేల్చి చెప్పిన మహోన్నతురాలు ఆమె..
“మా మావయ్య పింగళి వెంకయ్య గారు మహానుభావులు.. అటువంటి కుటుంబానికి నేను కోడలుగా రావడమే నా అదృష్టం అని చెప్పి, ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేసి ఆయనకి తలవంపులు తీసుకురాలేను నేను” ..అని చెప్పిందట..