న్యూ ఢిల్లీ : ది రిపోర్టర్ టీవీ: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను పార్టీ అధిష్టానం తొలగించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీజేపీ బాధ్యతలు అప్పగించింది.ఈనేపథ్యంలో బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు..