కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ :,తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని తన పేరు మీద చేయడం లేదని ఆస్తికోసం కిరాతకంగా చంపిన సంఘటన గన్నేరువరం మండలం గోపాల్ పూర్, జంగపల్లి గ్రామంలో బుధవారం నాడు జరిగిన విషయం విధితమే. ఈ సంఘటనలో నిందితుడు తమ్మనవేని వినోద్ (35) తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోను గురువారం నాడు అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన మృతురాలు తమ్మనవేణి కనకమ్మను 20 సంవత్సరాల క్రితం భర్త వదిలి వెళ్లడంతో కుటుంబ బాధ్యతలను తనే మోస్తూ వస్తున్నది. ఆమె పేరిట ఉన్న 1.20 గుంటల భూమిని ఆమె కొడుకు పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. గోపాల్పూర్, జంగపల్లి శివారులో ఉన్న రెండు ఎకరాల భూమిని తన పేరిట చేయించాలంటూ గత సంవత్సర కాలం నుండి ఒత్తిడి చేస్తున్నాడు. తల్లి తన పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయనందున ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. తేదీ 2-8-2023 రోజున ఆ భూమి అక్కా చెల్లెళ్ళు కాజేస్తారానే ఉద్దేశంతో తల్లి వ్యవసాయ పనులు చేస్తుండగా గోపాల్పూర్ గ్రామంలో విచక్షణ రహితంగా నాలుగుసార్లు తలపై బాధడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆస్తికి సంబంధించిన తగాదాలలో ప్రభుత్వ అధికారులు కానీ కోర్టులను సంప్రదించాలి తప్ప ఇలాంటి నేరాలకు పాల్పడడం సరైంది కాదని తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఒక ద్విచక్ర వాహనం హత్య చేయడానికి ఉపయోగించిన ఒక పారను స్వాధీనం చేసుకోవడం జరిగింది.