పల్నాడు జిల్లా కారంపూడి : కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 9 వ తేదీన విజయవాడలో జరిగే కార్మిక సంఘాల మహా ధర్నా ను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు కోరారు. శుక్రవారం కార్మిక సంఘాల ప్రచార జీపు జాతా కారంపూడి మండలానికి చేరింది. ప్రచార జీపు జాతా బృందానికి మండల సిపిఐ కార్యదర్శి షేక్ సైదా ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మహాధర్నాను జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె హనుమంతరెడ్డి, నాయకులు విల్సన్, షేక్ చిన్న జాన్ సైదా, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు జాను, పట్టణ కార్యదర్శి సూరె హనుమంతరావు, గాలం శ్రీను, చెన్నయ్య, జింకల కోటేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకుడు నూనె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.