సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ :బెజ్జంకి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికులు గత 33రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ ఈ తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వారి డిమాండ్లను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ కార్మికులు ధర్నా నిర్వహించడం జరిగింది. వారికి మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్ అధ్వర్యంలో బీఎస్పీ శ్రేణులు పాల్గొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కార్యదర్శి ఎగోలపు వెంకన్న గౌడ్,జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని 51 జీవోను రద్దు చేయాలని మరియు మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వారికి కనీస వేతనం 30 వేలకు తగ్గకుండా వేతనం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ నియోజకవర్గం చాతగాని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.కార్మికుల డిమాండ్స్ నెరవేర్చనీ పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ సిబ్బంది బొనగిరి లక్ష్మణ్,కొంకటి అశోక్,మిట్టపల్లి లక్ష్మణ్,కొరేపు శివకుమార్,బోనగిరి లచ్ఛవ్వ, వినోద్,అజయ్,మాతంగి రవి, మైల అనిల్,జడల సంపత్,పబ్బతి స్వామీ, బోనగిరి బాబు, బెజ్జంకి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.