కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో బొమ్మలకుంట కు వెళ్లే రహదారిని స్థానికులు ఇరువైపులా ఆక్రమించుకున్నారని నిత్యం ఆ వీధి గుండా నడిచే గ్రామస్తులు 25 ఫీట్లు ఉన్న రోడ్డును ఇరువైపులా స్థానికులు ఆక్రమించుకొని 12 ఫీట్ల వరకు తీసుకొచ్చారని, మా సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ వెంటనే సమస్యను పరిష్కరించాలని తిమ్మాపూర్ ఎంపీడీవో కార్యాలయనికి ఆదేశాలు జారీ చేశారు.ఇట్టి పిర్యాదు పై తిమ్మాపూర్ మండల ఎంపీఓ కిరణ్ సోమవారం గొల్లపల్లి గ్రామంలో ఉన్న ఇరుకు రోడ్డు ను పరిశీలించి, గ్రామంలో ఉన్న పెద్ద మనుషులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.