- హాజరుకానున్న రాష్ట్ర ప్రవళిక సంఘం ఉపాధ్యక్షుడు. వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం : గుండ్లపల్లి స్టేజి వద్ద నుండి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్ రోడ్డు పనులు ప్రారంభోత్సవం రేపు మంగళవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్.రసమయి బాలకిషన్ పాల్గొని ప్రారంభిస్తారని జెడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న తెలిపారు. గన్నేరువరం మండల కేంద్రం స్కూల్ కాంప్లెక్స్ నుండి బైక్ ర్యాలీగా గుండ్లపల్లి కి వెళ్తారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు, రైతు సమన్వయ సమితి, మార్కెట్ సొసైటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అన్ని అనుబంధ సంఘాలు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు.