- ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్ డిమాండ్
అల్లూరి జిల్లా, పాడేరు, ది రిపోర్టర్ : ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాడేరు శాఖ ఆధ్వర్యంలో పత్రిక విలేకర్ల సమావేశంని నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఏబీవీపీ గిరిజన విద్యార్థుల విభాగం రాష్ట్ర కన్వీనర్ అంగనైని ఆనంద్ మాట్లాడుతూ.. ఏజెన్సీ లో ఉన్న గిరిజన ఆశ్రమ, గురుకుల పాఠశాల కళాశాల వసతి గృహలలో వైద్య శిబిరాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు,ఈ సీజనల్ వ్యాధులు కారణంగా అనేక పాఠశాలలో అనారోగ్యంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అలాగే ప్రస్తుతం కళ్ళకలకలు ఎక్కువగా ఆశ్రమ పాఠశాల్లో ఎక్కువ వ్యాప్తి చెండుతున్న నేపథ్యంలో విద్య శాఖ అధికారులు చొరవ తీసుకోని ప్రతి పాఠశాలలో వైద్య శిబిరాలు నిర్వహించి ముందస్తుగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా అధికారులు చర్యలు చేపట్టలని అలాగే ప్రతి పాఠశాలలో స్నానానికి, మాగుగుదొడ్లుకి రన్నింగ్ వాటార్ సదుపాయం కల్పించాలని,అనేక పాఠశాలలో నిరూపయోగం లో ఉన్న మరుగుదొడ్లుని బాగుచేసి వినియోగంలో తీసుకు రావాలని, అనేక బాలికల పాఠశాలలో ప్రహరీ గోడ లేని పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మించాలని, ఆశ్రమ, గురుకుల, వసతి గృహలలో విద్య శాఖ అధికారులు పర్యటించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపట్టలని అంగనైని ఆనంద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూజారి ఉపేంద్ర, పాడేరు నగర కార్యదర్శి గిర్లియ నాగార్జున,పాడేరు భాగ్ కన్వీనర్ సీదరి వంశీ కృష్ణ,జిల్లా కో కన్వీనర్ పాటిబోయి సూర్యారావు, నగర స్టూడెంట్ ఫర్ సేవ కన్వీనర్ భగ్రీయ మహేష్ బాబు, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ కన్వీనర్ కిల్లో పరమేష్, నగర కార్యవర్గ సభ్యులు జి. బాబ్జి, ఎస్. గణేష్ పాల్గొన్నారు.