- సెప్టెంబర్ లో అందుబాటులోకి రెడ్డిపల్లి ఫ్లైఓవర్
- జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులను పరిశీలించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు
- నెరవేరిన చేగుంట రెడ్డిపల్లి పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరిక
- నెలలోపు చేగుంట రెడ్డిపల్లి జంక్షన్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పూర్తి
- దశాబ్దపు కాలంలో ఇదే ప్రాంతంలో 64 మంది మృతి
- సంవత్సరాల కల నెరవేర్చినందుకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కి ధన్యవాదాలు తెలిపిన చేగుంట మండల ప్రజలు.
- భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మరియు కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరి కి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే రఘునందన్ రావు అనుకున్న గడువులో ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేసినందుకు జాతీయ రహదారి అధికారులను మరియు కాంట్రాక్టర్ ను అభినందించిన దుబ్బాక ఎమ్మెల్యే
మెదక్ జిల్లా , చేగుంట మండలం : దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని దుబ్బాక ఎమ్మెల్యే మాధవినేని రఘునందన్ రావు నిలబెట్టుకున్నారు. దశాబ్ద కాలంగా డేంజర్ స్పాట్ గా ఉన్నా రెడ్డిపల్లి చేగుంట జంక్షన్ వద్ద రెడ్డిపల్లి గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంవత్సరం కాలంలోనే ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. కొన్ని సంవత్సరాలుగా సుమారు 64 మంది గత పాలకుల నిర్లక్ష్యానికి ఇదే రోడ్డుపై రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఇదే జాతీయ రహదారిపై ఉన్న మిగతా ఫ్లైఓవర్లు పూర్తయినప్పటికీ చేగుంట రెడ్డిపల్లి 10 సంవత్సరాలుగా పాలిస్తున్న ఇక్కడి ప్రజాప్రతినిధులు విస్మరించారు. దుబ్బాక శాసనసభ్యులుగా మాధవనేని రఘునందన్ రావు గారు గెలిచిన తర్వాత ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించడం పట్ల చేగుంట రెడ్డి పల్లి గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడున్న కొందరు ప్రజాప్రతినిధులు పనులు పూర్తయ్యాక వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప గత పది సంవత్సరాలుగా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఇదే జాతీయ రహదారిపై ఉన్న తూప్రాన్ ఫ్లైఓవర్ కొన్ని సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న విషయం మరియు చేగుంట ఫ్లైఓవర్ ప్రారంభించిన సంవత్సరం కాలంలోనే కూర్చోవడం పట్ల వ్యత్యాసాన్ని చేగుంట ప్రజలు గమనించాలని కోరారు. తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతనే జటిలమైన సమస్యలన్నీ క్రమక్రమంగా పరిష్కరిస్తున్నామని రానున్న రోజుల్లో దుబ్బాక నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.