సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల కేంద్రంలో మంగళవారం టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి వస్తున్న మానకొండూర్ ఎమ్మెల్యే రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ కు 33 రోజుల నుండి సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది తమ న్యాయమైన కోరికలతో కూడిన “మెమోరండం ” మండల బీఎస్పీ పార్టీ మద్దతుతో ఇచ్చే క్రమంలో స్థానిక బి ఆర్ ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఒకరినొకరు తోచుకోవడంతో ఘర్షణ చెలరేగింది, ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దల శ్రీనివాస్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందని మేము ఎమ్మెల్యేను అడ్డుకోలేదని గ్రామపంచాయతీ సిబ్బంది ఇబ్బందులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని ఒకవేళ అడ్డుకుంటే పోలీసులు అరెస్టు చేస్తారని బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం ఏంటని, ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధుల దృష్టికి ప్రజల సమస్యలను తీసుకెళ్లే బాధ్యత ప్రతిపక్షాలది కాదా!అని ప్రశ్నించారు.