- ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి.
- ప్రతి కార్యకర్త వంద మంది ఓటర్లను చైతన్య పరచాలి.
- బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తిరిగి వివరించాలి.
- ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొట్టాలి.
- సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించాలి.
సిద్దిపేట జిల్లా: దేర్ రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం స్థానిక మార్కెట్ కమిటీ హాల్లో బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ హాజరై దిశా నిర్దేశం చేశాడు, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఎన్నికలు వంద రోజులు మాత్రమే ఉన్నాయి అని, కెసిఆర్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలతో పాటు, ఎమ్మెల్యేగా తాను చేసిన మండల అభివృద్ధి పనులను ప్రతి కార్యకర్త తమకు నిర్దేశించిన గ్రామాలలో ప్రతి ఇంటింటికి తిరిగి వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అలాగే సోషల్ మీడియా మరియు అనేక వేదికలలో ప్రతిపక్షాలు చేసే విమర్శలకు దీటైన సమాధానాలు చెప్పాలని అలాగే ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం ద్వారా వారు పొందిన లబ్ధి తెలుసుకొని ఇంకా వారికి కావలసిన సౌకర్యాలను అడిగి తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు.
- అభివృద్ధి కోసమే అప్పులు* రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్.
బెజ్జంకి మండల కేంద్రంలో జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి,అప్పులు సంక్షేమ పథకాల కోసం ఉద్యోగుల జీతాల కోసం చేయలేదని “ఉత్పాదకత “కోసం అప్పులు చేసిందని 24 గంటలు కరెంటు ఇస్తుందని ప్రాజెక్టులు నిర్మించుకొని పల్లములో ఉన్న గోదావరి నీటిని పైకి తీసుకొచ్చి రైతుల పంట పొలాలకు అందిస్తుందని అప్పులు అభివృద్ధి కోసమే అనివివరించారు. అలాగే బెజ్జంకి కార్యకర్తలు సైనికుల పనిచేసే మళ్లీ బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, జడ్పిటిసి కనగండ్ల కవిత తిరుపతి, స్థానిక సర్పంచ్ దేవనపల్లి మంజుల శ్రీనివాస్, కరీంనగర్ సుడా చైర్మన్ కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు ఐల పాపయ్య, చేరికల కమిటీ ఇన్చార్జులు బోయినపల్లి శ్రీనివాసరావు, చింతకింది శ్రీనివాస్ గుప్తా, బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, మానకొండూరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎలా శేఖర్ బాబు, బిగుళ్ల మోహన్, మేకల శ్రీకాంత్, బిగుల్లా సుదర్శన్, లింగాల అర్జున్, జిల్లా ప్రభాకర్ యాదవ్, వంగ నరేష్తదితరులు పాల్గొన్నారు.
- మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం *
సిద్దిపేట జిల్లా: ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా మంగళవారం కచ్చు చంద్రకళ రాజయ్య, వైస్ చైర్మన్ గా హనుమంత లక్ష్మారెడ్డి తోపాటు డైరెక్టర్లు బెజ్జంకి శంకర్, ఏషిక కిషన్, మహేష్ గుప్తా, మల్లేశం గౌడ్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మరియు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ హాజరయ్యారు.