కరీంనగర్ జిల్లా: కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు (ఐపిఎస్) ఆదేశాల మేరకు గన్నేరువరం మండలం లోని హన్మజీపల్లె గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, తిమ్మాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో యువత డ్రగ్స్ గంజాయి లాంటి వాటికి దూరంగా ఉండాలని కళాబృందం వారు ఆటపాటలతో ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించారని జడ్పీటీసీ చెప్పారు. ముఖ్యంగా గ్రామాల్లో పట్టణాల్లో గాని మీ సెల్ నెంబర్ కి లక్కీ డ్రా 5 లక్షల రూపాయలు తగిలినవి అని మీ నెంబర్ కి ఓటిపి వచ్చిందని అది చెబితే 5 లక్షలు మీ అకౌంట్ లో జమ అయితే అని చెప్పగానే గుడ్డిగా నమ్మి ఓటిపి చెప్పి మోసపోవద్దని సీఐ తెలియజేశారు, గ్రామంలో మత్తుకు బానిసలు అవ్వద్దు అని గంజాయి డాగ్స్ సిగరెట్ లాంటి మత్తుకు దూరంగా ఉండాలని యువత.. కన్న తల్లిదండ్రుల పేరు తేవాలని తెలియజేశారు. గ్రామాల్లో దొంగతనాలు దోపిడీలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలంటే తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే మూఢనమ్మకాల వల్ల ప్రజలు చాలా మోసపోవడం జరుగుతుందని మూఢనమ్మకాలు బారిన పడొద్దు అని ఆర్థికంగా శరీరకంగా నష్టపోవద్దని అవన్నీ జిమ్మిక్కుల్లె ఏఆర్ ఎస్ఐ ముల్కల కాంతయ్య చేసిన మ్యాజిక్ ద్వారా ప్రజలను ఎంతో గాను ఆకట్టుకుంది. ఎస్సై చంద నరసింహారావు మాట్లాడుతూ గంజాయి విక్రయిస్తున్నటువంటి వారుగాని సేవించేవారు గానీ ప్రజల దృష్టికి వస్తే తక్షణమే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారు వారు పేర్లు గోప్యంగా ఉంచబడతాయి అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడ్, రాష్ డ్రైవింగ్, చేయొద్దని హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనాల యొక్క నంబర్ ప్లేటును ట్యాపరింగ్ చేయొద్దని, రాంగ్ రూట్ లో వెళ్తే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఈ చాలన్ ద్వారా జరిమానులు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగాల రజిత మహేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, నాయకులు న్యాత సుధాకర్, ఏఎస్ఐ పి లక్ష్మీనారాయణ, హెడ్ కానిస్టేబుల్ జి వెంకటస్వామి,కానిస్టేబుల్ బ్లూ కోర్టు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.