కరీంనగర్ జిల్లా: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బుడగ జంగాలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన దేవుడని బుడగ జంగాల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా గన్నేరువరం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి సిపిఐ పార్టీలకు చెందిన కొందరు వ్యక్తులు దళిత బంధు పథకంపై దుష్ప్రచారం చేయడానికి కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. బుడగ జంగాల కాలనీ రెండు గ్రూపులుగా విడదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దళిత బంధు పథకం పై వారు చేసినటువంటి ఆరోపణలు నిరాధారమని తెలిపారు. బుడగ జంగాలకు ప్రత్యేక కులం సర్టిఫికెట్లు ఇప్పించి చదువుకోవడానికి అవకాశం కల్పించిన బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని తెలిపారు.