సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగున్నర సంవత్సరాల నుండి గుర్తుకురాని ఇండ్లు లేని నిరుపేదలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ గృహలక్ష్మి అనే పేరుతో హడావిడి సృష్టించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఇండ్లు లేని నిరుపేదలపై నిజమైన ప్రేమ ఉంటే తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉండి చెయ్యని కార్యక్రమం ఇప్పుడు చేపట్టడం ఎన్నికల వ్యూహమే అని విమర్శించారు. అలాగే రైతుబంధు 10 ఎకరాల లోపు రైతులకే పరిమితం చేయాలని పేర్కొన్నారు. మరోపక్క విద్యారంగ సమస్యలను ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకుల పై పోలీసులు దాడి చేయడం అరెస్టు చేయడం సంక్షేమ హాస్టలను, ప్రభుత్వ రంగ పాఠశాలలను విద్యార్థి సంఘాలు మరియు మీడియా సందర్శించకూడదని విద్యాశాఖ సంచాలకురాలు దేవసేన ఆంక్షలు విధించడం సరైనటువంటి చర్య కాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ పరిపాలనలో అనేక లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే రానున్న ఎన్నికలలో ప్రజలు ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారనిపేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పోతు రెడ్డి వెంకట్ రెడ్డి, ధర్మారెడ్డి, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు దొంతర వేణి మహేష్, జిల్లా రైతు సంఘం నాయకులు నలవాల ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.