ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను దెబ్బతీసే విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేలేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు..
ఇవాళ (శనివారం) పశ్యిమగోదావరి జిల్లా నరసాపురంలో డీజీపీ పర్యటించారు. ఈసందర్భంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పుంగనూరులో పోలీసులపై అల్లరి మూకలు చేసిన దాడులను ఖండించారు. ఈ కేసులో ఇప్పటి వరకు సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా సరే పోలీసుల మీద దాడి చేస్తే.. కఠిన చర్యలు తప్పవు అని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు..
అయితే, పుంగనూర్ లో దాడికి పాల్పడింది స్థానికులా, లేక బయట నుంచి వచ్చిన వ్యక్తులా అన్నదానిపై లోతైన విచారణ చేస్తున్నామని డీజీపీ రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ అందరి కోసం పనిచేస్తుందని రాజకీయ పార్టీలు గుర్తించుకోని తమకు సహకరించాలి అని ఆయన తెలిపారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో కొత్త ఒరవడి సృష్టించాం.. 1.40 లక్షల మంది మహిళలు దిశా యాప్‌లో రిజిస్టర్ అయ్యారు అని ఈ సందర్భంగా డీజీపీ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 27 వేల మంది మహిళలు ఈ యాప్ ద్వారా పోలీసులకు కంప్లైంట్ చేశారు.. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో 20 శాతం నేరాలు తగ్గుముఖం పట్టాయని ఏపీ డీజీపీ తెలిపారు..