కరీంనగర్ జిల్లా:ది రిపోర్టర్ టీవీ: మానకొండూర్ మండలంలోని మద్దికుంట గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు పడి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మానకొండూర్ సీఐ రాజకుమార్ తెలిపిన వివరాల ప్రకారం. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన కోట శ్రీనివాసరెడ్డి(40) అనే వ్యక్తి ప్రముఖ సీడ్ కంపెనీలో ఆర్గనైజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఆదివారం సాయంత్రం మానకొండూరు మండలంలోని మద్దికుంట గ్రామ శివారులో కంపెనీ ఇచ్చిన సీడ్స్ పరిశీలిస్తుండగా, ఓ వ్యవసాయ బావి వద్ద ఒడ్డుకు వున్నా పైపుపై కూర్చుని రైతుతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు పైపు విరగడంతో బావిలో పడి మృతి చెందాడని సీఐ తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న హుజురాబాద్ ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి, మృతిని శవాన్ని స్థానికుల చేత బయటికి తీయించారు. మృతిదేహాన్ని పంచనామ నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు, మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సీఐ రాజ్ కుమార్ తెలిపారు.