కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: బీసీల అభివృద్దే బీ.ఆర్.ఎస్ పార్టీ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలోని కెఎస్ఆర్ గార్డెన్లో ఈరోజు మానకొండూర్ నియోజకవర్గ స్థాయిలో బీ.సీ. కుల వృత్తులకు మంజూరైన లక్ష రూపాయల చెక్కులతో పాటు కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణి చేశారు.పల్లెల్లు ప్రగతికి పట్టుకొమ్మలని, బీసి కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తూ ఆర్థిక సహకారం అందించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్య మంత్రి కేసీఆర్ లక్ష రూపాయలు అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే రసమయి వివరించారు.ఈకార్యక్రమంలో గన్నేరువరం జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి,గన్నేరువరం బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న,గునుకుల కొండాపూర్ ఎంపీటీసీ గుడెల్లి ఆంజనేయులు,ఎంపీడీఓ స్వాతి, మండల నాయకులు పాల్గొన్నారు
