- యూనియన్ హోమ్ మినిస్టర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఇనిస్టిగేషన్ అవార్డుకు ఎంపికైన గూడెం కొత్త వీధి సిఐ అశోక్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ యూనియన్ హోమ్ మినిస్టర్ అవార్డు ఫర్ ఎక్స్లెన్స్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎంపికయ్యారు రాష్ట్రానికి కేంద్ర హోమ్ మినిస్టర్ ద్వారా ఈ అవార్డుకు సీఏ అశోక్ కుమార్ ఎంపిక కావడం విశేషం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఐదుగురు పోలీస్ అధికారులను ఎంపిక చేసిన కేంద్ర హోం శాఖ అందులో గూడెం కొత్త వీధి సీఐ అశోక్ కుమార్ను ఎంపిక చేయడం పట్ల ఈ ప్రాంతీయులు అభినందనలు తెలియజేస్తున్నారు 2018 నుండి ఇప్పటివరకు జరిగిన అనేక సంఘటనల పట్ల ఆ సమస్యల పరిష్కారం కోసం బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసినందుకు గాను ఈ అవార్డు సీఐ అశోక్ కుమార్ ని కేంద్ర హోం శాఖ ఎంపిక చేసింది దీంతో గూడెం కొత్త వీధి మండలంలోని పలువురు సిఐ అశోక్ కుమార్ని అభినందించారు
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును అశోక్ కుమార్కు కేంద్ర హోం శాఖ అందజేయనుంది కాగా తనకు ఈ అవార్డు రావడానికి కృషిచేసిన పోలీస్ అధికారులకు సహకరించిన ప్రజలకు సీఐ అశోక్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు కేంద్ర హోం శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి 140 మంది సమర్థవంతమైన పోలీస్ అధికారులను ఎంపిక చేసింది ఇందులో పలు విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు ఉండడం విశేషం కాగా రాష్ట్రములో ఇద్దరు సిఐలు ఇద్దరు అసిస్టెంట్ ఎస్పీలు ఒక డిఎస్పీకి అవార్డు కోసం కేంద్ర హోం శాఖ ఎంపిక చేసింది