contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తిరంగా ర్యాలీలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప

సంగారెడ్డి , నారాయణఖేడ్ : దేశమంతటా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మేరా మాటి- మేరా దేశ్” కార్యక్రమం లో భాగంగా నారాయణఖేడ్ లో భారతీయ జనతా పార్టీ తిరంగా ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప మాట్లాడుతూ ‘నా మట్టి – నా దేశం’ అన్న నినాదంతో భారతదేశం అంతటా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ మట్టిని, ఈ దేశాన్ని కాపాడటం కోసం ఎందరో వీరులు ప్రాణాలను త్యాగం చేశారని, వాళ్ళందరికీ నివాళులర్పిస్తున్నట్టు పేర్కొన్నారు. తిరంగా ర్యాలీ ద్వారా ఈ మట్టి యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ, దేశం పై భక్తిని పెంపొందించేందుకు భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, పార్టీ సీనియర్ నాయకులు పట్నం నగిరేషం, మారుతి రెడ్డి, ఈశ్వరప్ప, ఎస్సీ మోర్చా ఈసీ నెంబర్ సుధాకర్ యువ మోర్చా నారాయణఖేడ్ అసెంబ్లీ కో- కన్వీనర్ పట్నం మాణిక్, జైపాల్, శివ,గోపాల్ రెడ్డి, శంకర్ పటేల్, దిగంబర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :