రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రైతులను మురిపించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.1 లక్షలోపు రుణాలను మాఫీ చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. నేడు… సోమవారం రోజున 10,79,721 మంది రైతులకు చెందిన రూ.6,546.05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. .