పల్నాడు జిల్లా కారంపూడి : కారంపూడి మండలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో చైర్మన్ బాలునాయక్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఎందరో మహానుభావులు త్యాగాలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.