- ముఖ్య కార్యాచరణ సమావేశంలో శంకరపట్నం మండల సర్పంచులు, ఎంపిటీసీల హామీ..
కరీంనగర్ జిల్లా: అభివృద్దే లక్ష్యంగా, ప్రజాసేవే ద్యేయంగా ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సాధించుకున్న రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మరియు మానకొండూర్ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్ గెలుపు కోసం కృషి చేస్తామని మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల సర్పంచులు మరియు ఎంపీటీసి సభ్యులు హామీ ఇచ్చారు, మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు మధ్యాహ్నం శంకరపట్నం మండలంలోని సర్పంచులు, ఎంపిటీసీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ముఖ్య కార్యాచరణ సమావేశానికి ఎమ్మెల్యే రసమయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈసందర్బంగా సర్పంచులు, ఎంపిటీసీలు మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన గులాబీ పార్టీని ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దే బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు బీ.ఆర్.ఎస్ పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. సైనికుల్లా పనిచేసి రసమయిని హాట్రిక్ ఎమ్మెల్యే గా అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని గౌరవ సీయం కేసీఆర్ కి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు.కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని, ఓర్వలేని కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న కుట్రలను తిప్పి కొడుతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మన పథకాలు ఎందుకు ప్రవేశపెట్టడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
రానున్న ఎన్నికల దృష్ట్యా కార్యకర్తలు ప్రతి ఇంటి గడప తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ చైతన్య వంతులను చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి తన ఆటా పాలతో ఉద్యమానికి ఊపిరి పోసిన చరిత్ర కలిగిన రసమయి రెండు సార్లు భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గా గెలుపొందడం మానకొండూర్ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా బావిస్తున్నట్లు వివరించారు. బీ.ఆర్.ఎస్ పార్టీ చేసిన ఎన్నో ఉద్యమాలు,పోరాటాల ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, సాధించుకున్న రాష్ట్రంలో రెండు సార్లు అధికారం చేపట్టి తెలంగాణ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి నేడు దేశంలోనే అగ్రగామిగా నిలువడమే కాకుండా, పరిపాలనా విషయంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారడం ఎంతో గర్వంగా ఉందన్నారు.నేడు యావత్ దేశం మొత్తం తెలంగాణ వైపు చూడటం గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ పరి పాలనకు నిదర్శనని, కోట్ల నిధులు వెచ్చించి మానకొండూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి పరిచిన ప్రజా నాయకుడు రసమయి కి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీ.ఆర్.ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అనే విషయాన్ని మరోసారి చాటి చెప్పాలని, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే బీ.ఆర్.ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ప్రజలకు పిలుపునిచ్చారు..