- అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లకు చెక్
- పట్టుకున్న రెవెన్యూ అధికారులు
కరీంనగర్ జిల్లా(ది రిపోర్టర్ టీవీ): చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో నుంచి బంజరు పల్లెకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్లు లో మట్టి తరలిస్తున్నారు. ఒక రైతు డైరీ ఫార్మా ఆవుల పైకి దుమ్ము లేస్తుందని నెమ్మదిగా వెళ్లండి అని చెప్పగా ట్రాక్టర్ డ్రైవర్లు రైతు పైకి దురుసుగా ప్రవర్తించి తిరగబడ్డారు. వెంటనే రైతు తాసిల్దార్ నరేందర్ కు సమాచారం ఇవ్వగా ఎస్సై శ్యామల రాజేష్ తోపాటు,రెవెన్యూ అధికారులు ఆర్ఐ,సంఘటన స్థలానికి చేరుకొని అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తాసిల్దార్ నరేందర్ తెలిపారు. తాసిల్దార్ నరేందర్ ను ది రిపోర్టర్ టీవీ రిపోర్టర్ వివరణ అడగగా ఎలాంటి ఆధారాలు, పర్మిషన్ లేకుండా మట్టి తరలిస్తున్నట్లు తెలిపారు.