కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన ఉమెంత్తల చంద్రారెడ్డి రెడ్డి భార్య అరుణ వీరికి ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, చిన్న కుమారుడు మధు రెడ్డి. తల్లిదండ్రులు వ్యవసాయం పని చేసుకుంటూ జీవిస్తున్నారు. చిన్న కుమారుడు హైదరాబాదులో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. పెద్ద కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటాడు, ఈనెల మూడు తేదీన చిన్న కుమారుడు మధు సం (26) ఆరోగ్య సమస్యలతో మృతి చెందగా…13 రోజుల తర్వాత పెద్ద కుమారుడు శ్రీకాంత్ రెడ్డి సం (29) తమ్ముని మృతి తట్టుకోలేక మనోవేదనకు గురై హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో వైద్యులు గుండె ఆపరేషన్ కూడా చేశారు. ఆపరేషన్ చేసినప్పటికీ ఈరోజు బుధవారం మధ్యాహ్నం హైదరాబాదులో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే ఇంటిలో ఇద్దరు కుమారులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు.
