కరీంనగర్ జిల్లా: సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం కరీంనగర్ టౌన్ నగర మహిళా అధ్యక్షురాలుగా గుర్రం రవళి గౌడ్ నియమిస్తూ కరీంనగర్ జిల్లా సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ అరుణ గౌడ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు, కరీంనగర్ పట్టణంలోని సర్వాయి పాపన్న మోకు దెబ్బ కార్యాలయంలో నియమక పత్రాన్ని జిల్లా అధ్యక్షురాలు అరుణ గౌడ్,
సర్వాయి పాపన్న మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి జాగిరి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు.తన నియామకానికి సహకరించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జక్కె వీరస్వామి గౌడ్, జిల్లా అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన అధ్యక్షురాలు రవళి గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేసి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.ఈకార్యక్రమంలో గన్నేరువరం మండల అధ్యక్షుడు సురేష్ గౌడ్, పాల్గొన్నారు
