- అన్యాయంగా తీసుకున్న భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలి..
అల్లూరి జిల్లా, అనంతగిరి,ది రిపోర్టర్ :అల్లూరి జిల్లా,అనంతగిరి మండలంలో నెలకొన్న భూ సమస్యలను అనంతగిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిట్టం మురళి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా మురళి మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాలుగా మండలంలో గల శంకుపర్తి గ్రామ రైతుల భూములు అక్రమార్కుల వసమైన విషయం తెలిసిందే అయితే గ్రామస్తులకు పలువురు ఆక్రమణ దారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలియడంతో జనసేనపార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి ఆశ్రయించారు మురళి చాలా రోజుల నుంచి అక్రమణ చేసిన భూములను తిరిగి రైతులకు ఇచ్చేంతవరకు పోరాటం ఆగదని అక్రమార్కులకు నిద్రలేని రాత్రులు బహుమానంగా ఇస్తామని పేద అమాయక గిరిజన రైతులనుంచి అక్రమంగా కాజేసినది కాకుండా ఇప్పుడు రకరకాల బెదిరింపులకు పాల్పడటం చూస్తుంటే వీరి గుండాయి జానికి అంతులేదని ఇప్పటికైనా గిరిజనులు ఒక ఆలోచన చేసి ఇటువంటి అక్రమార్కులకు తమను రక్షించే నాయకులు చేసే బాధ్యతలను అప్పజెప్పడం మానుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా శంకుపర్తి గ్రామాన్ని చేరుకుని స్థానిక గ్రామస్తులకు మేం ఉన్నామని కోల్పోయిన భూములు తిరిగి పొందే వరకు మీకు అండగా ఉంటామని జనసేన మురళి అన్నారు ఈ విషయంపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ పాంగి రవీంద్ర,గ్రామ ప్రజలు వెంకటేష్ ,బాబురావు తదితరులు పాల్గున్నారు.