contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రేపు సూర్యాపేటకు రానున్నా సీఎం కేసీఆర్

సూర్యాపేట : సీఎం కేసీఆర్‌ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

వీటి ప్రారంభోత్సవం అనంతరం సుమారు రెండు లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జన సమీకరణకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూర్యాపేట నియోజకవర్గంలోని మండలాలు, పట్టణాల బాధ్యతలను అప్పగించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిద్దిద్దారు. రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతు చేశారు. సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ కార్యాలయాలకు నూతనంగా రోడ్లు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన విజయవంతానికి ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

సూర్యాపేటలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైనది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఈ మార్కెట్‌ను నిర్మించారు. సుమారు రూ.30కోట్లతో 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కెట్‌ను నిర్మించారు. ఆరుఎకరాల విస్తీర్ణంలో ఐదు బ్లాకుల్లో 200 దుకాణాలు నిర్మించారు.

ఈ మార్కెట్‌లో రోజుకు 9 నుంచి 10గంటల పాటు స్కైషేడ్‌తో పగటి వెలుగు ప్రసరించేలా ఏర్పాటుచేశారు. దేశంలోనే ఈ తరహా మార్కెట్‌ నిర్మాణం సూర్యాపేటలోనే ప్రథమం కావడం విశేషం. మార్కెట్‌లోని దుకాణాల్లో విద్యుత్‌ లైట్లు అవసరం లేకుండా పగటి వేళల్లో స్కైషేడ్‌ ద్వారా వెలుతురు ప్రసారం అవుతుంది. ఈ మార్కెట్‌లో పండ్లు, పూలు, మటన్‌, చికెన్‌, కూరగాయలు, చేపలతో పాటు ఇంకా పలు రకాల వస్తువులు ఒకే చోట లభించేలా నిర్మించారు.

రూ.65కోట్లతో సమీకృత కలెక్టరేట్‌ భవనం

జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సుమారు రూ.65కోట్లతో నిర్మించారు. 21ఎకరాల్లో 1.25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు.

జిల్లాలోని 37 ప్రభుత్వ శాఖలన్నీ ఈ భవనంలోనే కొనసాగనున్నాయి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, మీటింగ్‌ హాల్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించారు. కార్యాలయాన్ని గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తుల్లో నిర్మించారు. కలెక్టరేట్‌లో పచ్చదనానికి అధిక ప్రాధా న్యం ఇచ్చారు. ప్రాంగణంలో సుమారు 70రకాల మొక్కలు నాటారు. అంతేగాక హెలీప్యాడ్‌ను నిర్మించారు.

కలెక్టరేట్‌కు విద్యుత్‌కు బదులు సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశా రు. సుమారు రూ.65లక్షలతో వంద కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ ఎనర్జీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. కలెక్టరేట్‌కు మిషన్‌ భగీరథ నీటిని అందించనున్నారు.

కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మిషన్‌ భగీరథ నీటినే వినియోగించనున్నారు. అందుకు కలెక్టరేట్‌ సముదాయం వద్ద 1.20లక్షల లీటర్ల సామర్ధ్యంతో ట్యాం కులు నిర్మించారు. ఈ ట్యాంకులకు ఖమ్మం రోడ్డులోని మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటుచేశారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :