- జాతీయ ప్రధాన కార్యదర్శిగా
- ఎన్నికైన సంజయ్ కు బాధ్యతలు
- కేంద్రంలో బీజేపీ అధికార ప్రయత్నానికి పెద్దపీట
తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ఏపీ పార్టీ వ్యవహారాల్లో బాధ్యతలు తీసుకుంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పని చేసిన బండి సంజయ్ ను పార్టీలో పరిణామాల నేపథ్యంలో తప్పించారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని నియమించారు. బండి సంజయ్ ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఏపీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ గా బండిని నియమిస్తారని ప్రచారం సాగుతున్న వేళ సంజయ్ ఈ నెల 21న ఏపీకి రానున్నారు.బండి సంజయ్ ఈ నెల 21న విజయవాడ రానున్నారు. ఏపీలో ఓటరు నమోదు ప్రక్రియను సమీక్షించనున్నారు. పార్టీ నాయకత్వం ఆయనకు అయిదు రాష్ట్రాలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ బాధ్యతలను అప్పగించింది. మహారాష్ట్ర, గోవా, ఒడిశా, ఏపీలో బండి కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు.ఏపీకి చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తమిళనాడు , కేరళ, కర్ణాటక, పుదుచ్చేరిలో ఓటరు నమోదు బాధ్యతలు నిర్వహించనున్నారు. తెలంగాణకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు రేఖా వర్మ నియమితులయ్యారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతంది. జనసేనతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ, టీడీపీ విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వటం లేదు.వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. టీడీపీతో పొత్తు విషయంలో ఏపీ బీజేపీలో భిన్న స్వరాలు వినిపిస్తన్నాయి. తెలంగాణలో మాత్రం టీడీపీతో పొత్తు వద్దని అక్కడి నేతలు బీజేపీ నాయకత్వానికి స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ ఇంఛార్జ్ గా పని చేసిన సునీల్ దేవధర్ ను పార్టీ తప్పించింది.ఇప్పుడు ఆయన స్థానంలో బండి సంజయ్ కు బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. దీని ద్వారా అటు తెలంగాణల, ఇటు ఏపీలోనూ బండి సంజయ్ సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. పొత్తు రాజకీయల వేళ…పార్టీ సొంతంగా ఎదగాలనే భావ తో ఉన్న బండి సంజయ్ కు బాధ్యతలు అప్పగిస్తే రాజకీయంగా ఎటువంటి సమీకరణాలు చోటు చేసకుంటాయనేది ఆసక్తి కరంగా మారింది.