కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్ర ఓల్డ్ ఏజ్ హోమ్ కు ఫ్రెండ్స్ ఫరెవర్ కిట్టి బృందం లక్ష్మీదేవి పల్లి సర్పంచ్ కరివేద పద్మజా శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 15 వేల ఆర్థికసాయం అందజేశారు. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వహణ కష్టంగా మారినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలకు స్పందించిన ఫ్రెండ్స్ ఫరెవర్ కిట్టి బృందం ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకుడికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి సర్పంచ్ కరివేద పద్మజా శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల మీడియాలో వచ్చిన కథనాన్ని చూసి తమ కిట్టి గ్రూప్ లో చర్చించుకోవడం జరిగిందన్నారు. గ్రూప్ సభ్యుల సహకారంతో 15 వేల రూపాయల చిన్న సాయాన్ని నిర్వాహకుడి అందజేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా కరీంనగర్ లో ఇలాంటి గ్రూపులో ఎన్నో ఉన్నాయనీ, వారంతా కలిసి తమకు తోచిన సాయం చేస్తే నిర్వాహకులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అలాగే తన కోరిక మేరకు ఓల్డేజ్ హోమ్ కు ఆర్థిక సాయం అందజేసిన సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.