- పల్నాడు హాస్పిటల్స్ లో అమ్మకోసం పధకాన్ని సద్వినియోగం చేసుకుంటున్న గర్భిణీలు
- పల్నాడు ప్రాంతంలోనే మొట్టమొదటిగా ఒక్కరోజులో 21 కాన్పులు
- డాక్టర్ చింతలపూడి రమ్యహారిక అరుదైన రికార్డ్
పిడుగురాళ్ళ పట్టణంలోని పల్నాడు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ రమ్య హారిక అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు. కేవలం 24 గంటల్లో 21 మంది గర్భిణీ స్త్రీలకు పల్నాడు హాస్పిటల్స్ లో కాన్పులు లు చేసి ఔరా అనిపించారు. కీళ్ళ మార్పిడీలో గోల్డ్ మెడల్ సాదించిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సతీమణి డాక్టర్ రమ్య హారిక( M.S(OBG) గోల్డ్ మెడలిస్ట్ స్త్రీ ప్రసూతి సంతాన సాఫల్యత వైద్య నిపుణురాలు) పల్నాడు ప్రాంత చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఒకే రోజులో 21 మంది గర్భిణీ మహిళలకు సిబ్బంది సహాయంతో కాన్పులు చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటల నుండి మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు 21 మంది గర్భిణీ మహిళలకు కాన్పులు చేయగా అందులో 11 మంది మగ శిశువులు, 10 మంది పండంటి ఆడ శిశువులకి గర్భిణీ స్త్రీలు జన్మనిచ్చారని పేర్కొన్నారు. తల్లులు, పిల్లలు క్షేమంగా వున్నారని వెల్లడించారు.