అల్లూరి జిల్లా, మారేడుమిల్లి మండలం : మన్యం మారేడుమిల్లిలో ప్రకృతి అందాలతో పాటుగా అటవీ జంతువులు కూడా సంచరిస్తాయి.ఏదొక మూల వింత వింత జీవులకు మారేడుమిల్లి వేదికగా మారుతుంది.దింతో మారేడుమిల్లి ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి మండలం కుండాడ గ్రామంలో మొసళ్లు కలకలం రేపాయి.కుండాడ గ్రామం వద్ద ఉన్న చెరువులో నీళ్లు తాగుతున్న మేకలపై మొసలి దాడి చేసింది.దింతో స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అటవీ అధికారులు స్థానికుల సహకారంతో సుమారు వారం రోజుల పాటు రెస్క్యూ చేసి మొసలిని పట్టుకున్నారు. పట్టుకున్న మొసలిని వైద్య పరీక్షలు చేసి ఆరేళ్ళ వయసు ఉంటుందని అధికారులు వెల్లడించారు.అనంతరం మారేడుమిల్లి నేషనల్ పార్క్ పరిధిలోని పాములేరు వాగు లో వదిలేశారు.ఇప్పటి వరకు పాములేరు వాగులో సుమారు ముప్పై వరకు మొసళ్ళు ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు.
