సిద్ధిపేట జిల్లా :ది రిపోర్టర్ టీవీ :బెజ్జంకి మండలం కేంద్రంలో శనివారం బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు వచ్చే శాసనసభ ఎన్నికలలో బి ఆర్ స్ ప్రభుత్వం పైన ఉన్న ప్రజా వ్యతిరేకతను ముందుగానే పసిగాట్టి ఓటమి భయంతోనే గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల పోటీ చేస్తున్నారని విమర్శించారు, ఈటల రాజేందర్ విసిరిన సవాలుకు బయపడి రెండు స్టానాలలో పోటీకి దిగుతున్నాడు అనీ పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం దళితబంద్, గృహలక్మి, బీసీ బంద్ అంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని, ప్రజలేవ్వరు వచ్చే ఎన్నికలలో మరొమారు కెసిఆర్ మోసాపు మాటలకూ ఓట్లు వేసే పరిస్థితి లో లేరు, తెలంగాణ ప్రజలలో రాజకీయ చైతన్యం వచ్చింది అనీ పేర్కొన్నారు.