- వైసీపీ ప్రభుత్వమే హోల్ సేల్ దోపిడీ చేస్తుంది – బండారు సత్యానందరావు
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట : ఇసుక విధానం అవినీతిమయంగా మారిందని,జగన్ ప్రభుత్వమే హోల్ సేల్ దోపిడీ చేస్తుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు,నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఆరోపించారు.రావులపాలెం మండలం రావులపాడు శివారు మల్లయ్యదొడ్డి జాతీయ రహదారి సమీపంలోని ఇసుక స్టోరేజీ వద్ద జగన్ ప్రభుత్వం ఇసుక దోపిడీ ఆపాలంటూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు కొత్తపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా జొన్నాడలో ఇసుక స్టోరేజ్ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరి,స్వేతపత్రాన్ని డియాండ్ చేసినా ఇప్పటివరకూ ఈ సిగ్గులేని ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదని గుర్తు చేశారు.మాకున్న సమాచారం ప్రకారం జేపి సంస్థకు మే నెలలోనే అనుమతులు పూర్తయ్యాయని తెలిపారు. ఏ విధంగా రాష్ట్రమంతా ఒకే సంస్థకి అనుమతులు కట్టబెట్టారో,లక్షలాది టన్నుల్లో ఇసుక స్టోరేజ్ చేయడానికి అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు.ఉంటే ఆ అనుమతులను బయటపెట్టాలని లేని పక్షంలో ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని డిమాండ్ చేశారు.లేకపోతే తెలుగుదేశం పార్టీ తరుపున పోరాటం చేస్తామని ప్రజలందరికీ మీ అవినీతిని బహిర్గతం చేసి ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇచ్చేందుకు పోరాటం చేస్తామని తెలిపారు.టన్ను ఇసుక 6 వందల 25 రూపాయల చొప్పున ట్రాక్టర్ ఇసుక 25 వందలకు అమ్ముతున్నారని,లారీ ఇసుకే 12 వేల రూపాయలకు అమ్ముతున్నారని ఇక ట్రాన్స్పోర్ట్ తో కలిపితే పేదవాడికి ఇసుక పెను భారంగా మారిందని దుయ్యబట్టారు.పేదలు ఇళ్లు నిర్మాణం లేక వారి ఇంటి కల జగన్ ప్రభుత్వం కలగానే మిగిలిపోయిందని,భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బందుకు పడే పరిస్థితికి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ ప్రభుత్వంమానికి జేపి సంస్థకు మద్య ఒప్పందాలు బయట పెట్టాలని లేదంటే మీ అవినీతి చీకటి ఒప్పందాలపై ప్రజా పొిరాటం చేస్తామని అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకొస్తామని సత్యానందరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.