అల్లూరి జిల్లా, హుకుంపేట, ది రిపోర్టర్ న్యూస్: హుకుంపేట మండలం సంతారి పంచాయతీ చిన్న బూరుగు పుట్టు గ్రామ సమీపంలో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. గతంలో హుదూద్ తుఫాన్ వచ్చి నప్పుడు వంతెన యొక్క పునాదిరాళ్లు మొత్తం కొట్టుకుపోయాయి. అప్పటి ప్రభుత్వంలో ఉన్న అరకు శాసనసభ్యులు కిడారి సర్వేశ్వరరావు , సివేరి సోమ పర్యటించి పరిశీలించి కొత్త వంతెన నిర్మాణానికి నాంది పలికారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు వాళ్ళిద్దరూ అకాల మరణం పొందారు దీని తర్వాత ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇప్పటివరకు వంతెన శిథిలావస్థకు చేరినప్పటికీ పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వంతెన మీదుగా సుమారు 200 పైగా గ్రామాల ప్రజలు ప్రయాణిస్తుంటారు. ఈ వంతెన కూలిపోతే వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించి పోతాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితిలు ఎక్కువగా ఉన్నాయి. వెంటనె ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోర్చుతున్నారు.