contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కొయ్యూరు మండల ప్రజా సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి

అల్లూరి జిల్లా, కొయ్యురు, ది రిపోర్టర్ : అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం, అంతాడ పంచాయతీ, గంపరాయి గ్రామంలో సమస్యలు పరిష్కారం చేయాలని ఆ గ్రామస్తులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలసి విజ్ఞప్తి చేశారు.

అందులో భాగంగా సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి చొరవతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ని కలిసి మంచి నీరు, గ్రావెల్ రోడ్డు, పాఠశాల భవనం, అంగన్వాడీ టీచర్ నియమించాలని కోరారు.

అలాగే జిల్లా కలెక్టర్ ని మా గ్రామానికి సందర్శించాలని కోరారు,అంగన్వాడీ నిత్యవసర వస్తువులు సరఫరా జరగడం లేదని, దీని కారణంగా పిల్లలకు పౌష్టికాహారంఅందకపోవడంతో అనారోగ్యానికి గురవుతు న్నారని, పాఠశాల భవనం లేక నేటి బాలలే రేపటి పౌరులు కాస్త విద్యకు దూరం అవుతున్నారని, రహదారి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యానికి గురైతే, మార్గమధ్యంలో చనిపోవలసి వస్తుందని, మంచి నీరు సౌకర్యం కల్పించాలని ఆ గ్రామ కొర్ర అప్పారావు, గెమ్మెలి నారాయణరావు, వంతల బాబురావు, మర్రి సన్యాసిరావు,చందరరావు యువకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :