- ప్రజలు అడగడం చాలు వెంటనే ఏదోవిదంగా సమస్యను పరిస్కరిస్తున్నారు
సిద్ధిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ :బెజ్జంకి మండలకేంద్రములో గత వర్షాలకు ఏర్పడ్డ గుంతలు, నిత్యం భారీ వాహనాలు వెళ్తుప్పుడు పగిలిన సీసీ రోడ్లు వాహనదారుల పాలిట యమపాశాలుగా మారినాయి. కానీ ఎవ్వరు పట్టించుకోకపోవడముతో ఈ దిక్కుమాలిన ప్రభుత్వానికి ఇంకా గెలిపిస్తామా అంటూ తిట్టిపోస్తున్నారు. వీళ్ళు ఎలాగు చెయ్యరు. జర్ర నువ్వైనా గుంతలు పూడ్చారాదా అని ప్రజలు కోరగా కళ్ళెపెల్లి రోడ్డులో ఎత్తుగడ్డలో ఏర్పడ్డ గుంతను మట్టితో పూడ్చి చదునుచేసిన బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, బొనగం రాజేశం, బోనాల లింగయ్యలను ప్రజలు సంతోషించి అభినందలు తెలుపుతున్నారు .