మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామములో ఫారెస్ట్ అధికారులు పోడు భూములకు పోడు పట్టాలు ఇచ్చినట్లే ఇచ్ఛి అడ్డుకుంటున్నారని. దుక్కి దున్ని నారు పోసి, తీరా పోలాల్లో నాట్లు వేసే సమయానికి అవి ఫారెస్ట్ భూములని ఇందులో పంటలు వేయరాదాని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేసారు. గత 25 ఏళ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటుండగా ఫారెస్టు అధికారులు తమ వద్ద నుండి మామూళ్ళు వసూలు చేసేవారని, గ్రామ సర్పంచ్ జల్ల సతీష్ అద్వర్యంలో 300 ఎకరాలకు గానూ, ఒక్కో ఎకరానికి 650 రూపాయల చొప్పున చెల్లించేవారమని, ఇప్పుడు కూడా అదే పద్దతిలో ఇవ్వాలని ఫారెస్టు అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ భూములకు 2008 సంవత్సరంలోనే ఇందిరా క్రాంతి పథకం ద్వారా పట్టాలు వచ్చాయని అదేవిధంగా ఇంద్ర జలప్రభ పథకం ద్వారా బోర్లు వేసుకున్నామని, అప్పటి నుండే ఫారెస్టు అధికారుల ఆగడాలు ఆగడం లేదని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.