Military Engineer Services: ఇందులో సూపర్‌వైజర్, డ్రాట్స్‌మెన్ పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
ప్రధానాంశాలు:
ఎంఈఎస్ జాబ్ నోటిఫికేషన్
502 సూపర్‌వైజర్, డ్రాట్స్‌మెన్ జాబ్స్ భర్తీ
మే 17 దరఖాస్తులకు చివరితేది
మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో ఖాళీగా ఉన్న 572 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 502 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సూపర్‌వైజర్, డ్రాట్స్‌మెన్ పోస్టులున్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు మే 17 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ పోస్టులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://mes.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 572
సూపర్‌వైజర్- 458
డ్రాఫ్ట్స్‌మెన్- 114
అర్హతలు: డ్రాఫ్ట్స్‌మెన్ పోస్టులకు ఆర్కిటెక్చురల్ అసిస్టెన్స్‌షిప్‌లో డిప్లొమా చేయాలి. సూపర్‌వైజర్ పోస్టులకు ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏదో ఒకదాంట్లో పీజీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం తప్పనిసరి.
వయసు: అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: మే 17, 2021
వెబ్‌సైట్:https://mes.gov.in/