సిద్దిపేట జిల్లా, ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో బుధవారం రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ మరియు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ చేతుల మీదుగా గొర్రెల పంపిణీ కార్యక్రమం జరిగింది 14 యూనిట్ల గొర్రెలను 14 మంది లబ్ధిదారులకు మొత్తం 294 గొర్రెలను పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, వారు ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఉద్దేశంతో సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఓవైపు రైతాంగానికి మరొకవైపు ఇతర కులాల వారికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి కుటుంబాలలో కెసిఆర్ వెలుగులు నింపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాము గౌడ్, స్థానిక ఎంపీటీసీ, బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, జెడ్పిటిసి కనగండ్ల కవిత తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు చంద్రకళ రాజయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమండ్ల లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, నాయకులు ఎలుక దేవయ్య,రామలింగారెడ్డి, బిగుల్లా మోహన్, మేకల శ్రీకాంత్, బిగుల్లా సుదర్శన్, బిఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి బోనగిరి శ్రీనివాస్, మానకొండూర్ బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.