సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ: బెజ్జంకి మండలం బేగంపేట గ్రామంలోని అంగనవాడి కేంద్రంలో బుధవారం పోషణ మాసోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అంగన్వాడి సూపర్ వైజార్ నాగరాణి మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ల ద్వారా చంటి పిల్లలకు ఆటపాటలతో పాటు, పౌష్టికమైన బలవర్ధకమైన ఆహారం అందించడం జరుగుతుందని, దీనిని చంటి పిల్లల తల్లులు మరియు గర్భిణీ స్త్రీలు, సదివినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి అంగన్వాడి విద్యార్థుల చేత అక్షర అభ్యాసం చేయించి స్వయంగా ఒళ్ళు కూర్చుండబెట్టుకొనిఅక్షరాలు దిద్దించారు.అలాగే గ్రామ ఎంపీటీసీపోతిరెడ్డి స్రవంతిమధుసూదన్ రెడ్డిచేతులతో అంగన్వాడి పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజార్ నాగరాణి, అంగన్వాడి కార్యకర్తలు శీలం సప్న, గడ్డం జలజ, అంగన్ వాడి ఆయాల, వైద్య అధికారిని డా : వైష్ణవి, పాఠశాల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు బెజ్జంకి రూప, పురుషోత్తం రమ, చంటి పిల్లల తల్లులు, గర్భిణీ స్త్రీలు, అంగన్వాడి విద్యార్థులు, గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.