- నాడు పల్లె ప్రగతి అవార్డు…
- నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ ఆడిటోరియంలో జరిగిన జిల్లాస్థాయి స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల కార్యక్రమంలో జిల్లాలో మొదటి స్థానంలో గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న కు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ గోపి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, పిడి డిఆర్డిఏ అధికారి శ్రీలత చేతుల మీదుగా సోమవారం అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో గ్రామం ముందంజలో ఉందన్నారు. గ్రామ ప్రజలు, అధికారుల సహకారంతో అవార్డు తీసుకోవడం సంతోషమన్నారు. నాడు పల్లె ప్రగతి అవార్డు… నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు తీసుకోవడం తో పాటు రాష్ట్ర,జాతీయ అవార్డు తీసుకోవాలని కోరారు. అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, మండల, గ్రామ నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.