కరీంనగర్ జిల్లా: స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ 2023 కు గాను రాష్ట్రస్థాయి అవార్డు ఖాసీంపేట గ్రామానికి దక్కింది. ఈ సందర్భంగా గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అవార్డును సర్పంచ్ గంప మల్లీశ్వరి అందుకున్నారు. తడి పొడి చరిత్ర సక్రమంగా నిర్వహించడం మురికినీటి కాలువల నిర్వహణ బహిరంగ మల విసర్జన పూర్తిగా నిర్మూలన చేయడం. కిచెన్ గార్డుల ఇంకుడు గుంతల నిర్మాణం. నీటి పొదుపు వంటి వాటిల్లో ప్రతిభ కనబరిచింది. రెండు వేల జనాభా గల పంచాయతీల్లో ఖాసీంపేట గ్రామపంచాయతీకి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. అవార్డుతోపాటు గ్రామపంచాయతీకి 10 లక్షల మంజూరు చేయాలని ప్రిన్సిపల్ సెక్రెటరీకి మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు, సీఈవో పవన్ కుమార్, డిఆర్ డిఓ పిడి శ్రీలత, డిపిఓ విరబూచ్చయ్య, ఎంపీడీవో స్వాతి, ఎంపీ ఓ నరసింహారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి ఆనంద్ పాల్గొన్నారు.