- ప్రతి ఇంటికి నీరు అని ప్రచారం కేవలం ఓట్ల రాజకీయం మాత్రమే – మిషన్ భగీరథ కేవలం కమిషన్ల కే పరిమితం అయ్యింది.
- ప్రజా సమస్యలు పట్టానీ స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజా ప్రతినిధులు ఏ మొకం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడగడానికి వస్తారు.
- పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్ బీఎస్పీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు.
సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బీఎస్పీ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కేవలం ప్రజా ప్రతినిధులు కమీషన్లు పంచుకోవడంలోనే పరిమితమైన దృశ్యం బెజ్జంకి మండలం, ముత్తాన్నపేట గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. దాదాపుగా ముత్తాన్నపేట గ్రామంలో ఉన్న 60 దళిత కుటుంబాలు గత 5 రోజులుగా నిత్య అవసరాల నిమిత్తం నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కానీ పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు. ఇవేవీ పట్టాని ప్రజా ప్రతినిధులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరియు స్థానిక అసమర్థ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మెప్పు పొందాలని అదే గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన నిమిత్తం ప్రచార ఖర్చుల కోసం అని ముత్తన్నపేట గ్రామంలో ఉన్న దాదాపుగా 15 మహిళ సంఘాల మహిళలు ప్రతి ఒక్కరి నుండి 150 రూపాయల చొప్పున ఇవ్వాలని స్థానిక గ్రామ ప్రజా ప్రతినిధి చెప్పడం చాలా సిగ్గు చేటు. వెంటనే అసమర్థ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముతాన్న పేట గ్రామంలో ఉన్న దళిత వడాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున నిరశన కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే ని, స్థానిక ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మానకోండూర్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి నీషాని రాజమల్లు, అసెంబ్లీ బీట్ సెల్ ఇంఛార్జి ఉప్పులేటి శ్రీనివాస్, బెజ్జంకి మండల అధ్యక్షులు మాతంగి తిరుపతి, ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్, నాయకులు ఇరుమల్ల రవి తదితరులు పాల్గొన్నారు.