ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు రోజులుగా ఆచూకి లేకుండా పోయిన వ్యక్తి సామాన్యుడేం కాదు. సాక్షాత్తు ఓ జిల్లా పరిషత్ చైర్మన్. అందులోనూ అధికార పార్టీకి చెందిన నేత. అయినా.. అటు కుటుంబ సభ్యులు కానీ, ఇటు సొంత పార్టీ నాయకులు కానీ పోలీసులకు కూడా ఫిర్యాదు ఇవ్వకపోవడ గమనార్హం. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే రీడ్ దిస్ స్టోరీ..!
ఏప్రిల్ 30వ తేది అర్ధరాత్రి మొబైల్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆచూకి ఇంతవరకు లభ్యం కావడం లేదు. కనీసం ఫోన్‌లో కూడా టచ్‌లోకి రావడం లేదు. దీంతో ఆయన మిస్సింగ్.. మిస్టరీగానే మిగిలిపోయింది. తెలంగాణమంతా ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో జడ్పీ చైర్మన్ విషయంలో ఆయన కుటుంబ సభ్యులు కానీ అధికార పార్టీ కానీ నేటికి స్పందించడం లేదు. ఇటువంటి పరిణామాలతో ఆయన ఎక్కడున్నారన్న ఆందోళన తీవ్రమవుతోంది.