కరీంనగర్ జిల్లా: మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయింది. సీఎం కేసీఆర్ పాలనకు తమ సంపూర్ణ మద్దతు పలుకుతూ, ఎమ్మెల్యే రసమయి చేపట్టిన అభివృద్ధికి అండగా నిలుస్తూ గులాబీ గూటికీ భారీగా చేరికలు ఉపందుకున్నాయి.. బుధవారం శంకరపట్నం మండలం బీ.ఆర్.ఎస్.పార్టీ కార్యాలయం లో ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా బీ.ఆర్.ఎస్. పార్టీలో చేరగా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు.
