contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్యారెంటిలేని బిచ్చగాళ్ల … మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దు : రసమయి

  • గన్నేరువరంలో గృహాలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలు పంపిణీ
  • మాదాపూర్ గ్రామంలో గృహాలక్ష్మి ఇంటి నిర్మాణానికి భూమిపూజ
  • యాభై ఏళ్ళ పాలనలో కాంగ్రెస్ ఎందుకు అభివృద్ధి చేయలేదు
  • కేసీఆర్ సీఎం అయ్యాకే అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు
  • ప్రజల్లో గందరగోళం సృష్టించడానికే కాంగ్రెస్ గ్యారెంటీ లేని హామీలు

 

కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: ఓట్లు వస్తేనే ఊర్లలోకి వచ్చే గ్యారంటీ లేని బిచ్చగాళ్ల మాటలు నమ్మి ప్రజలు మాయలో పడొద్దని… కవ్వంపల్లి ఎప్పుడూ ఏ పార్టీలో ఉంటాడో ఆయనకే గ్యారెంటీ లేదని…ఇగ ప్రజలకు గ్యారెంటీ పేరుతో ఊర్లలోకి పగటివేశగాళ్ల మాదిరిగా వస్తున్నారని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డా, రసమయి బాలకిషన్ అన్నారు. గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామంలో గృహాలక్ష్మి ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. అనంతరం గన్నేరువరం మండల కేంద్రంలోని పంక్షన్ హాల్ లో వివిధ గ్రామాలకు చెందిన గృహాలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పత్రాలు పంపిణీ చేశారు.

ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న గ్రామాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించడం జరుగుతుందని, గృహాలక్ష్మి పథకం ద్వారా ఇంటి స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రూ.3లక్షల సాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.

2014 కు ముందు తెలంగాణ రాష్ట్రంలో సాగునీళ్లు లేక రైతులు పొలాలను బీళ్లు పెట్టి గల్ఫ్ దేశాలతో పాటు, ముంబాయి,హైదరాబాద్ వలసవెళ్లి కుటుంబాలను సాదుకున్నారని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక మూడున్నరేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి లక్షలాది ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా పొలాలు బీళ్లు ఉండేవని… కేసీఆర్ పాలనలో భూములన్నీ పచ్చటి మాగానులయాయని అన్నారు.

రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు పోయి అప్పులు తెచ్చి పంటలు వేసుకోవద్దు.. రైతులకు అండగా నిలవాలనే లక్ష్యంతో రైతుబందు పథకం ద్వారా ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని, రైతుభీమా పథకం ద్వారా రైతులు ఏ కారణంతోనైన మరణిస్తే రూ.5లక్షల సాయం అందించి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని అన్నారు.

పేదింటి ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దనే లక్ష్యంతో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా రూ.లక్ష116 సాయం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.అంగన్ వాడి కేంద్రాల ద్వారా గర్భిణులకు కోడిగుడ్లు, పాలు, పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్ తో పాటు ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, మగబిడ్డ పుడితే రూ.12వేలు అందించడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని గ్యారెంటీ కార్డు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఎలా అమలు చేస్తుందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని,కాంగ్రెస్ దోంగ హామీలతో ప్రజలను మభ్య పెడుతుందని అన్నారు.

దళితబంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు రూ.10 లక్షల సాయం అందించి ఆత్మగౌరవంతో బ్రతికేలా చేయడం జరుగుతుందని, బీసీ బంధు పథకం ద్వారా కులవృత్తులపై ఆధారపడిన వారికి రూ.లక్ష సాయం చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని పగటి వేషాలు వేసిన కూడా ప్రజలు నమ్మబోరని, మానకొండూర్ గడ్డపై మూడోసారి బీఆర్ఎస్ జెండానే ఎవురుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో కరంటు కోతలు ఉండేవని, కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎరువులు సమయానికి అందక రోజుల తరబడి లైన్లు కట్టేవారన్నారు.రైతుల కోసం ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు.

వికలాంగులకు అండగా నిలవాలనే లక్ష్యంతో రూ.4016 పెన్షన్ ఇస్తున్నామని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడికార్మికులకు ఆసరా పథకం ద్వారా రూ.2016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, ఎంపీడీవో స్వాతి, మానకొండూరు నియోజవర్గ కన్వీనర్ లింగాల మహేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్,నాయకులు అల్వాల కోటి,వివిధ గ్రామాల సర్పంచులు అట్టికం శారద,కర్ర రేఖ, కుమ్మరి సంపత్, లక్ష్మీ, నక్క మల్లయ్య, మండల ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :