తమిళ సూపర్ స్టార్, తలైవర్ రజనీకాంత్ ను హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ కలిశారు. చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లిన లారెన్స్… ఆయన కాళ్లు మొక్కి, ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో లారెన్స్ పంచుకున్నారు. తన గురువు తలైవా రజనీకాంత్ సార్ ను కలిశానని ఎక్స్ వేదికగా లారెన్స్ తెలిపారు. ‘జైలర్’ సినిమా సూపర్ హిట్ అయినందుకు అభినందనలు తెలిపానని చెప్పారు. అలాగే తన ‘చంద్రముఖి-2’ సినిమా విడుదల నేపథ్యంలో సార్ ఆశీర్వాదం తీసుకున్నానని… చాలా సంతోషంగా ఉందని అన్నారు. రజనీ సార్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. ‘గురువే శరణం’ అని అన్నారు.