తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లకు… నకిరేకల్, సిద్ధిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, పోలీసులు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ర్యాలీలు, సమావేశాలపై నిషేధం ప్రకటించారు. ఈ నెల 27 సాయంత్రం 5 గంటల తర్వాత ప్రచారం నిషిద్ధమని వెల్లడించారు. ఈ నెల 27 నాటికి ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.