- వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గా కొత్త ముఖాలు పరిశీలన*
- శెట్టి పాల్గుణ పై తీవ్ర వ్యతిరేకతే కారణమా!
- గెలుపు గుర్రాల కోసం అధిష్టానం వెతుకులాట
- రేసులో నైని సత్తిబాబు, రేగం మత్స్య లింగం,పాంగి.చిన్నా రావు,శెట్టి రోషిణి, శెట్టి నీలవేణి, వంతాల రామన్న,సమర్ది రఘు నాధ్,చెట్టి అప్పాలు,తడబారికి సురేష్ కుమార్,బత్తిరి రవిప్రసాద్ లు
అల్లూరి జిల్లా అరకు: అరకు నియోజక వర్గంలో అధికార పార్టీలో అలజడి రేగుతోంది.ప్రస్తుత ఎమ్మెల్యే పై ఒకరిద్దరూ మినహా ,మెజారిటీ జడ్పీటీసీలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు గుర్రుగా ఉన్నారనేది బహిరంగ రహస్యం,గత ఎన్నికల్లో వెన్నంటే ఉన్న నేతలందరూ తామే ఎమ్మెల్యే టిక్కెట్ రేసులో ఉండటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అరకు నియోజక వర్గంలో
ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, సీపీఎం పార్టీలు కొండ దొర లకు ఎమ్మెల్యే టికెట్ లు కేటాయిస్తాయని తెలియడం తో,వైసీపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇవ్వాలో డైలమాలోపడింది,మళ్ళీ వైసీపీనుండి వాల్మీకి సామాజిక వర్గానికి కేటాయించాలా లేదా కొండ దొర సామాజిక వర్గానికి కేటాయించాలా!అనే మీమాంసాలో ఉంది,ఎవరికి కేటాయిస్తే గెలుపు అవకాశం ఉంటుందనే విషయాల్ని నిఘా వర్గాల ద్వారా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త ముఖాల్లో ఎవరికి అవకాశం ఇవ్వొచ్చు!
గత ఎన్నికల్లో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలందరూ ఒక్కటిగా ఉంటూ చెట్టి పాల్గుణ గెలుపు కు కృషి చేశారు, వాళ్లే ఇప్పుడు అభ్యర్థులు గా మారి టిక్కెట్ రేసులో ఉండటాన్ని చెట్టి పాల్గుణ జీర్ణించుకోలేక పోతున్నారు.పాల్గుణ వ్యతిరేక అంశాలు ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేర వేస్తున్నారు. టిక్కెట్ రాకుండా చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు,టిక్కెట్ నిరకరిస్తే తమనే టిక్కెట్ వస్తుందనే గంపెడు ఆశలతో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన బత్తిరి రవి ప్రసాద్,తడ బారికి సురేష్ కుమార్,అరకు జడ్పీటీసీ శెట్టి రోషిణి,అనంత గిరి ఎంపీపీ శెట్టి నీలవేణి,శెట్టి అప్పాలు,ప్రయత్నిస్తుంటే,అదే సమయంలో కోదు పీవీటీజీ వర్గానికి చెందిన వంతాల రామన్న,కోటియా సామాజిక వర్గానికి చెందిన సమర్ది రఘు నాధ్,కొండ దొర సామజిక వర్గానికి చెందిన రేగం మత్స్య లింగం,పాంగి చిన్నారావు,నైని సత్తిబాబు లు తీవ్రంగా టిక్కెట్ ప్రయత్నం ఉన్నారు.
చెట్టి పాల్గుణ కు టిక్కెట్ ఇవ్వకుంటే!
సర్వేల్లో… ఉన్న సమాచారం మేరకు టిక్కెట్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదని…గుసగుసలు వినిపిస్తున్నాయి.టిక్కెట్ మార్చాల్సి వస్తే టిక్కెట్ ఎవరికి అనేది పెద్ద ప్రశ్న గా ఉన్న,అధిష్టానం కాస్తాక్లారిటీ గానే ఉన్నట్టు భోగట్టా.. గత…ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి గా పోటీలో నిలిచిన సివ్వేరి దొన్ను దొర ,తెలుగుదేశం అభ్యర్థి మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ ను మూడవ స్థానంలో నెట్టి, రెండో స్థానంలో నిలిచారు.దీనితో దొన్ను దొర కు టీడీపీ టిక్కెట్ ఖాయంగా కనిపిస్తోంది, ఇదే వైసీపీ పార్టీకి చిక్కు తెప్పిస్తోందట, టీడీపీ ని ఎదుర్కోవాలంటే బలమైన నాయకుడు కావాలనే అన్వేషణ లో వైసీపీపడింది,పాంగి చిన్నా రావు,వంతాల రామన్న,సమర్ది.రఘు నాధ్,శెట్టి అప్పాలు,శెట్టి రోషిణి, శెట్టి నీల వేణి, బత్తిరి రవి ప్రసాద్,సురేష్ కుమార్ ఆర్థికంగా బాగా బలమైన వ్యక్తులు గా ఉన్నారు, ఐతే ఆర్థికంగా బలంగా లేని రేగం మత్స్య లింగం,నైని సత్తిబాబు ల మద్యే పోటీ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం,రేగం మత్స్య లింగం జడ్పీటీసీ గా ప్రత్యేక క్యాడర్ 6 మండ లాల్లో కలిగి ఉన్నా,వయోభారం వెంటాడుతుంది,క్యాడర్ తో ఉత్సాహంగా పని చేయలేకపోతున్నారు,
నైని సత్తిబాబు సతీమణి నైని రజిని బాకూరు ఎంపీటీసీ గా పని చేస్తున్నారు,సత్తిబాబు కొండదొర కాగా భార్య రజిని భగత సామాజికవర్గానికిచెందిన వారు,సత్తిబాబు కు యూత్ పాలోయింగ్ ఉండటం, ఆరు మండలాల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో సంబంధాలు ఉండటం నైని సత్తిబాబు కు ఎమ్మెల్యే టిక్కెట్ వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తోంది.